శ్రీ కొవ్వూరి బసివిరెడ్డిగారు వ్యవసాయ వాణిజ్యములందు ఆరితేరినవారై అనేకమైన భూములు, సంపదలు సంపాదించుటయేగాక వాటిని నితరణ చేసిన దానశీలురు. గృహదానము, వస్త్రదానము, అన్నదానము. బావులు త్రవ్వించుట, వనములు పెంచుట, దేవాలయ నిర్మాణము, అగ్రహారముల నిర్మాణము, అపత్యప్రార్తి, నిధినిక్షేపముల ఏర్పాటు, సంతృతిన పొందుట మొదలైన బడసిన మహనీయులు శ్రీ బసివిరెడ్డి గారు, శ్రీ బసివిరెడ్డి గారి సప్తసంతినముల అన్నదానమునకు నిదర్శవముగా క్రీ.శ. 1897 లో బ్రిటిష్ మహారాణి ప్రశంసించి పంపిన పత్రము నేటికిని కలదు కుతుకులూరు, కాకినాడ, గొల్లలమామిడాడ, గండ్రేడు, నిడదవోలు బసివిరెడ్డి పేటలే ఆయన కీర్తికి దర్పణములు.
Read more →స్వస్తిశ్రీ చాంద్రమాన శుభకృత్ నామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ త్రయోదశీ బుధవారము అనగా ది . 18 - 06 - 1902 నాడు శ్రీయుతులు కొవ్వూరి బసివిరెడ్డి గారిచే శ్రీపాంచరాత్రాగము | ప్రావీణ్యులైన శ్రీమాన్ రేజేటి రంగాచార్యులు స్వామి వారి ఆధ్వర్యమున శ్రీ సూర్యనారాయణ స్వామివారిని , శ్రీలక్ష్మీనారాయణ , శ్రీ రమాసమేత సత్యనారాయణ స్వామివార్ల ఉపాలయములుగా శ్రీ విష్వక్సేన , గరుడాళ్వార్ మొదలుగాగల పరివార దేవతలుగను ధ్వజస్థంబ సహితముగా ఆలయము ప్రతిష్టాకార్యక్రమము జరుపబడింది .
Read more →