Mr. Kovvuri Basivireddy was a philanthropist who acquired a large amount of land and wealth while cultivating it in the agri-business. Home donation, clothing donation, food donation. Digging of wells, afforestation, construction of temples, construction of agraharams, apathyaprapti, setting up of treasures, acquisition of satiety, etc. A letter of appreciation sent by the British Queen in 1897 is still found. Today at Kuthukuluru, Kakinada, Gollalamamidada, Gandredu. Nidadavolu Basivireddy streets are the mirror of his fame. Many wells were dug and inns were built in Srikakulam, Vijayanagaram, Visakhapatnam and Ubhaya Godavari districts. Sri Suryanarayana Swamy Temple was built by Sri Kovvuri Basivireddy at Gollalamamidada, is one of the largest temples in Andhra Pradesh. The Sri Basivi Reddy Gari Satra in Samarlakota, where the Nithyannadanam is being continued, is a testament to his generosity.
శ్రీ కొవ్వూరి బసివిరెడ్డిగారు వ్యవసాయ వాణిజ్యములందు ఆరితేరినవారై అనేకమైన భూములు, సంపదలు సంపాదించుటయేగాక వాటిని నితరణ చేసిన దానశీలురు. గృహదానము, వస్త్రదానము, అన్నదానము. బావులు త్రవ్వించుట, వనములు పెంచుట, దేవాలయ నిర్మాణము, అగ్రహారముల నిర్మాణము, అపత్యప్రార్తి, నిధినిక్షేపముల ఏర్పాటు, సంతృతిన పొందుట మొదలైన బడసిన మహనీయులు శ్రీ బసివిరెడ్డి గారు, శ్రీ బసివిరెడ్డి గారి సప్తసంతినముల అన్నదానమునకు నిదర్శవముగా క్రీ.శ. 1897 లో బ్రిటిష్ మహారాణి ప్రశంసించి పంపిన పత్రము నేటికిని కలదు కుతుకులూరు, కాకినాడ, గొల్లలమామిడాడ, గండ్రేడు. నిడదవోలు బసివిరెడ్డి పేటలే ఆయన కీర్తికి దర్పణములు. శ్రీకాకుళము, విజయనగరము, విశాఖపట్టణము, ఉభయగోదావరి జిల్లాలలో అనేకమున బావులు త్రవ్వించుట, సత్రములు కట్టించుట జరిగినది. శ్రీ కొవ్వూరి బసివిరెడ్డి గారు గొల్లలమామిడాడలో నిర్మించిన శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయము, ఆంధ్రదేశములోనే వన్నెకెక్కినది. నిత్యాన్నదానము కొనసాగింపబడుతున్న సామర్లకోటలోని శ్రీ బసివిరెడ్డిగారి సత్రము ఆయన దాతృత్వమునకు నిదర్శనము.